Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ హిల్ కౌంటీ పరిధిలోని డంపింగ్ యార్డ్, గ్రేవ్ యార్డులను జనావాసాలకు దూరంగా తరలించాలని నిజాంపేట్ టీఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో బాచుపల్లి హిల్ కౌంటీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ హామీ ఇచ్చారు.