Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 31వ డివిజన్ రాజీవ్ గృహకల్పలో సీపీఐ(ఎం) నాయకులు బి. వెంకట రామయ్య ఆధ్వర్యంలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాలను పరిశీలించారు. డ్రయినేజీ, పైప్లైన్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయని తెలిపారు. అసలే చిన్న చిన్న వీధులు కావడం, ఆపై పనుల్లో జాప్యంవల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పైప్లైన్ నిర్మాణ పనులోల ఆలస్యం కారణంగా దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని, దర్వాసన వెదజల్లుతోందని చెప్పారు. పనులు త్వరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) మండల కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు, కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు బాల పీర్ తదితరులు పాల్గొన్నారు.