Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ పారిజాత నర్సింహారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న కాలనీల ప్రజల సమస్యల శాశ్వత పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని 26వ డివిజన్లోని శ్రీ హిల్స్ కాలనీలో మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డితో కలసి శ్రీ హిల్స్ కాలనీలో పర్యటించి కాలనీ సమస్యల పరిష్కారం కోసం కషి చేస్తామని హామీ ఇచ్చారు. కాలనీలో పర్యటించి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో కార్పొరేషన్లోని అన్ని డివిజన్లలోని ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తామని తెలిపారు. ముఖ్యంగా 26వ డివిజన్లోని డ్రైనేజి నిర్మాణం త్వరలోనే చేపట్టి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. త్రాగునీటి సమస్యను అధికారుల దష్టికి తీసుకువెళ్లి త్వరగా పరిషరిస్తామని తెలిపారు. అనంతరం 24వ డివిజన్లోని ఏఆర్సీఆర్ కాలనీలో కార్పొరేటర్ ఏనుగు రాంరెడ్డితో కలసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు లక్ష్మయ్య, యాదగిరి రావు, రవీందర్ నాయక్, సత్యనారాయణ రావు, రమేష్ గౌడ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.