Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
మల్కాజిగిరి డివిజన్ బాల సరస్వతి నగర్లోని నిరుపేద కుటుంబానికి చెందిన ఎంబీబీఎస్ విద్యార్థినికి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నందికంటి శ్రీధర్ అండగా నిలిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన ఇలాంటి ఆణిముత్యాల్లాంటి విద్యార్థులకు చేయూతను అందించడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు వి.శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ యాదవ్, రాములు, అలీ, రెబ్బ వాసు, రాజేష్ గౌడ్, సాయి కుమార్, జీవన్, విట్టల్, తదితరుతలు పాల్గొన్నారు.