Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బేగంపేట్
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సికింద్రాబాద్, ప్యాట్నీ సెంటర్లో సోమవారం ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భగా హైదరాబాద్ డీఎంఅ ండ్హెచ్ఓ డాక్టర్ వెంకటి మాట్లాడుతూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందన్నారు. దోమ కాటు ద్వారా మలేరియా, డెంగూ, చికెన్ గున్యా, బుద్ధ కాయలు, మెదడు వాపు వంటి వ్యాధులు వచ్చి సామాజికంగా ఆర్థికంగా ప్రాణనష్టం జరుగుతుందన్నారు. అన్ని డిపార్ట్మెంట్లు కలిసి కట్టుగా పని చేసి దోమలను నివారించాలని కోరారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలనీ, నీళ్లు ఉన్న చోట దోమలు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జిల్లా ఇమ్యునై జేషన్ అధికారి డాక్టర్ శ్రీకళ, జిల్లా మలేరి యా అధికారి డాక్టర్ నిరంజన్, జిల్లా మాస్ మీడియా అధికారులు శ్రీనివాస్, వెంకటేశ్వ ర్లు, బొందుగుల వెంకటేశ్వర్‌రెడ్డి, జేఏసీ సెక్రెటరీ, సబ్ యూనిట్ ఆఫీసర్లు, మలేరి యా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.