Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ పారిజాత నర్సింహారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
రంజాన్ పండుగ సంద ర్భంగా ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొ రేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి అన్నా రు. సోమవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని 18వ డివిజన్ ది ప్రైడ్ కాలనిలో నిర్వహించిన ఇఫ్తార్ పార్టీ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బండారు మనోహర్ తో కలసి మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఈ. కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ భగవంతుణ్ణి ఎన్ని రూపాల్లో పూజించిన మనం నిజాయితీగా ప్రార్ధన చేస్తే క్రమశిక్షణ అలవర్చుకుంటే ఆ దేవుడు కూడా మన పట్ల కప చూపుతాడని తెలిపారు. ఆ అల్లా దయతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ సాహబ్, అబ్దుల్లా హకీమ్ బాబ్ హాజర్ , ప్రొఫెసర్ ప్రమోద్ కుమార్, కాలనీ వాసులు, సద్బవన ఫోరమ్ మహేశ్వరం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.