Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హయత్‌నగర్
ఎల్బీనగర్లో మిస్సింగ్ అయి, ఖమ్మంలో హత్యకు గురైన ఘటన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబీ కులు తెలిపిన వివరాల ప్రకారం నాగోల్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో నివాసం ఉంటున్న పదిరే భాను చందర్ (30). ఈనెల 16న తన బంధువుల పెళ్లి మహబూబ్‌నగర్‌కు వెళ్ళాడు. సాయంత్రం కాగానే అదే రోజు అతని భార్య కావ్య ఫోన్ చేయగా రాయగిరి వద్దకు చేరుకున్నానని చెప్పాడు. ఆ తరువాత ఫోన్ ా్వచ్వఫ్ అనుమానం వ్యక్తం చేసిన ఆమె పిర్యాదు మేరకు మిస్సింగ్ కేస్ నమోదు చేశారు.
హత్యకు దారితీసిన కారణాలు...
పెళ్లికి అని నాగోల్ సాయి నగర ్కాలనీలో నివాసం ఉంటున్న 5గురు కలిసి టాయోట ts 07 hr% 2447 గల కార్‌ను అద్దెకు తీసుకుని వెళ్ళారు. ఇటీవల భాను చందర్ ప్రేమ వివాహం జరిపించాని సమాచారం. పాత కక్షలను మనసులో పెట్టుకుని హత్య చేశారా...లేక ప్రేమ వివాహం విషయంలో హత్య జరిగిందా అనే విషయాలు తేలాల్సి ఉంది.16న వెళ్లిన భాను యాదాద్రి భువనగిరి జిల్లా అయిన రామన్న పేట లో ఉన్న మూసి నదిలో కొట్టుకొచ్చిన శవం ఖమ్మం లో తేలడంతో అక్కడ ఉన్న ఓ అనాధ శరణాలయం నిర్వాహకులు చూసి అక్కడి ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించగా బంధువులకు సమాచారం అందడంతో భాను చందర్ గా గుర్తించారు.మళ్ళీ వారు తీసుకువెళ్లిన కార్ హైదరాబాద్ నగరంలోని నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పెట్రోల్ బంక్ వద్ద సీట్ బెల్ట్ వాడనందుకు జరిమానా పడ్డట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం.కార్ లో ప్రయాణం చేసిన వారందరూ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.