Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
''గతంలో 25 ప్రొజెక్టులకు ఒకే రోజు శంకుస్థాపన చేసి చరిత్ర సృష్టించిన మేమే ఆ చరిత్రను తిరగ రాసే రోజు రావడం ఆనందంగా ఉంది. ఈ రోజు 33 ప్రాజెక్టులకు, ఆంధ్ర ప్రదేశ్ లో 24 శాతం, తెలంగాణలో 9, శంకుస్థాపన చేసి రియల్ ఎస్టేట్ రంగంలో మరో కొత్త సంపుటి మొదలుపెట్టడానికి మా సంస్థ ఉద్యోగుల కృషి, మా కస్టమర్లు, శ్రేయోభిలాషుల ప్రోత్సాహమే కారణం. రెండు రాష్ట్రాల్లో 5 ప్రధాన నగరాల్లో ఈ ప్రొజెక్టులకు శ్రీకారం చుట్టి అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ధరలతో నాణ్యమైన ఇండ్లు నిర్మించాలనే దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తోంది మా హనీ గ్రూప్.'' అని హనీ గ్రూప్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ ముక్క ఓబుల్ రెడ్డి తెలిపారు. 2022లో రియల్ ఎస్టేట్ పరిశ్రమ, ఇండ్లు నిర్మించే విధానం, విక్రయించే పద్ధతి ఇంకా ప్రజల లైఫ్ స్టైల్ కూడా అపూర్వమైన మార్పుని చూస్తోందన్నా రు. ఒకే రోజు విశాఖపట్నం-15, రాజమండ్రి-4, కాకినాడ-2, విజయవాడ-3, హైదరాబాద్-9 మొత్తం 33 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి హనీ గ్రూప్ నిర్మాణ రంగంలోనే ఒక బెంచ్ మార్కుని సెట్ చేసింది. కొత్త భవనాల రూప కల్పన, నిర్మాణంలో అనేక వినూత్న పద్ధతులతో హనీ గ్రూప్ ఇలాంటి మరెన్నో ప్రాజెక్టులను పూర్తి చేసే ప్రయత్నంలో ముందుకు వెళ్తోందన్నారు.