Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
అన్ని వర్గాల అభివృద్ధి ప్రభుత్వం ప్రధాన ధ్యేయం అని నగర మేయర్ విజయలక్ష్మి అన్నారు. రామంతపూర్ మాజీ కార్పొరేటర్ గంధం జోష్ణ ఆధ్వ ర్యంలో నిర్వహించిన రంజాన్ తోఫా కానుకల కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి రామంతపూర్‌లో తోఫా కానుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే సుబ్బారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు ప్రశాంత వాతా వరణంలో శాంతియుతంగా జరుపుకోవడానికి వారికి తగిన నిధులు,పేద ప్రజలకు కానుకలు అందజేస్తుం దన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్, గొపు సదానంద్, మాజీ కార్పొరేటర్, ముస్లిం సోదర సోదరీమణులు, టీిఆర్‌ఎస్ శ్రేణులు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సంపత్ రావు, కొప్పు నర్సింగ్ రావు పాల్గొన్నారు.