Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి వార్డు కార్యాలయంలో సీపీఐ మండల కార్యదర్శి పాలబిందెల శ్రీనివాస్, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు హరినాథ్‌తో కలిసి మేడేకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని అన్నారు. కార్మికులకు నష్టం కలిగించే 4 కోడ్లను వెంటనే రద్దు చేయాలని, పనిచేసే సమయాన్ని పెంచకుండా చూడాలని అన్నారు. మే 1న మేడే రోజు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు రాములు, టి. శ్రీనివాస్, కె.మల్లయ్య, కార్మికులు రజిత, భాగ్యమ్మ, నర్సమ్మ, రవి, లక్ష్మి, అంజమ్మ, రాజు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.