Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒయాసిస్ ఫెర్టిలిటీ వైద్య బృందం
నవతెలంగాణ-బంజారాహిల్స్
అవగాహన లేమితోనే సంతానలేమి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఒయాసిస్ ఫెర్టిలిటీ వైద్య బృందం యాజమాన్యం పేర్కొంది. ఈ సందర్భంగా ఒయాసిస్ ఫెర్టిలిటీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుధాకర్ జాదవ్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ పరీనాజ్ పరిహర్ మాట్లాడుతూ 'నేడు భారతదేశంలో వంధ్యత్వం గురించి గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైంది. భారతీయ జనాభాలో 10 నుంచి 15% మంది సంతానలేమితో నిశ్శబ్దంగా బాధపడుతున్నారు. ప్రతి ఆరుగురిలో ఒకరు ఈ సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు, భారతదేశంలో 27.5 మిలియన్ల జంటలు వంధ్యత్వానికి గురవుతున్నారు. సంతానోత్పత్తి సమస్యలో 50 శాతం పురుషులదే. గ్రామీణ ప్రాంతాల్లో పురుగుమందుల ప్రభావం కారణంగా పురుషులలో ఇది ప్రబలంగా ఉన్నది. పెరుగుతున్న పురుషుల సంతానోత్పత్తి సమస్యలను పరిష్కరించడానికి ఒయాసిస్‌లో పురుషుల కోసం ప్రత్యేకంగా సంతానసాఫల్య క్లినిక్ ఉంది. వయస్సు పెరిగేకొద్దీ తమ సొంత బిడ్డను కనే అవకాశం తగ్గుతూనే ఉన్నందున, వేగంగా చర్య తీసుకోవడానికి, సంతానోత్పత్తి క్లినిక్‌ని చేరుకోవడానికి సమాజంలో అవగాహన కల్పించడానికి తాము ఏప్రిల్ 24 నుంచి 30 వరకు వివిధ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాం' అని వారు తెలిపారు.