Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ ప్రజా సేన
నవతెలంగాణ-బంజారాహిల్స్
రాష్ట్రంలోని దళిత, బహుజన మైనారిటీ వర్గాల్లో ఐక్యతను తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ ప్రజా సేవ పేరుతో సంఘాన్ని స్థాపించినట్లు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మకంటి రమేష్ వర్మ తెలిపారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రధాన కార్యదర్శి నక్క రాజు, ఉపాధ్యక్షులు సంజీవ, మహిళా విభాగం ఉపాధ్యక్షులు సరస్వతి లతో కలిసి మాట్లాడారు. కులమతాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాలు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం సంఘం పనిచేస్తుందని తెలిపారు. నూతనంగా ఆవిర్భవించిన తమ సంఘాన్ని గ్రామస్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన పార్టీలకి తమ సంఘం మద్దతు ఇస్తుందని చెప్పారు.