Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బోడుప్పల్
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వారాంతపు సంతలలో మరియు కార్పొరేషన్ సూచించిన ప్రదేశాలలో తై బజార్ వసూళ్ల కోసం ఏర్పాటు చేసిన తై బజార్ వేలం రూ.30లక్షలు పలికింది. బుధవారంనాడు ఇన్చార్జ్ కమిషనర్ పద్మజారాణి ఆధ్వర్యంలో జరిగిన తై బజార్ వేలంపాటలో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన సుధాకర్ యాదవ్ అనే వ్యక్తి స్వంతం చేసుకు న్నాడు. మొత్తం ఆరు మంది టెండర్లు వేయగా అందులో అధికంగా పాడిన వ్యక్తికి తై బజార్ వస్తుంది. కార్పొరేషన్ నిబంధనల మేరకు తై బజార్ వసూళ్లు చేయాలని, లేనిపక్షంలో కాంట్రాక్టు రద్దు చేస్తామని కమిషర్ చెప్పారు. ఈ తై బజార్ కాంట్రాక్టు మే నెల నుండి పదకొండు నెలలు కొనసాగుతుందని తెలిపారు. ఈ వేలం పాటలో అర్వో మంజులత ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
తై బజార్ వేెలం రద్దు చేయాలని ధర్నా..
అసలే కరోనా కారణంగా జీవనోపాధి లేక ఇబ్బందులు పడుతున్న చిరువ్యాపారులను తై బజార్ వసూళ్ళ పేరిట ఇబ్బందులకు గురిచేయ్యెద్దని కార్పొరేషన్ కార్యాలయం ముందు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చిరు వ్యాపారుల సంఘం అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసలే కరోనా వైరస్, అధిక ధరల కారణంగా వ్యాపారాలు సాగడమే కష్టంగా ఉన్న ప్రస్తుత పరిస్థితులలో తై బజార్ వేలం కాంట్రాక్టు ఇవ్వడంతో వారి దోపిడీకి లైసెన్స్ ఇవ్వడమేనని వాపోయారు. పెరిగిన ధరలకు అనుగుణంగా లాభాలు రావడం లేదు. వచ్చిన లాభాలలో అధిక సంఖ్యలో తై బజార్‌కు చెల్లించడంతో మాకు ఏం మిగులుతుందని ప్రశ్నించారు. చిరు వ్యాపారులు చేస్తున్న ధర్నాకు మద్దతు గా 14వ డివిజన్ కార్పొరేటర్ కుంభం కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరు వ్యాపారులు రాజు, నాగి, మహేష్, ఉదరు, ముస్తాఫా, మల్లేష్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.