Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
శ్రమదోపిడీికి వ్యతిరేకంగా పోరాడిన కార్మిక వీరుల పోరాట స్ఫూర్తి మే డే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు రవీంద్రచారి, ఏఐటీయూసీ రంగారెడ్డి ఇల్లా కార్యదర్శి సామిడి రాజశేఖర్రెడ్డి అన్నారు. మే డేను జయప్రదం చేయాలని కోరారు. ఏఐటీయూసీ అటో ట్రాలీ, డ్రైవర్స్ యూనియన్ అటోనగర్ సమితి కార్యదర్శి శంకర్ ఆధ్వర్యంలో బుధవారం వనస్థలిపురంలో వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కార్మికుల హక్కుల కోసం శ్రమ దోపిడీికి వ్యతిరేకంగా విరోచితమైన పోరాటాలు చేసి రక్తపుటేరులు పారిన రోజు మేడే అన్నారు. పాలకులు పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక హక్కులను కాలరాస్తే సహించేది లేదన్నారు. సమాన పనికి సమాన వేతనం, ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంట్రాక్టు వ్యవస్థను రద్దుచేసి, పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తానన్న కేసీఆర్ మేడేను పురస్కరించుకొని అయినా సానుకూలంగా ఆలోచించాలన్నారు. అటోనగర్లో ట్రాన్స్పోర్టులలో హమాలి వర్కర్స్కు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలకనుగుణంగా హమాలీ రేట్లను పెంచాలని ట్రాన్స్పోర్టు యాజమా న్నాన్ని కోరారు. ఏఐటీయూసీ హయత్నగర్ మండల కార్యదర్శి రమావత్సక్రు, మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు శ్రీదేవి, సుభద్ర, సహాయ కార్యదర్శులు, సరిత, రాధ, హమాలి సంఘం నాయకులు దశరథ్. రంగస్వామి వెంకట్ పాల్గొన్నారు.