Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
ఓయూ మోడల్ హైస్కూల్ యాన్యువల్ డే వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పప్పుల లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడుతూ ఓయూ మోడల్ హైస్కూల్‌ను విద్యా, క్రీడా, సాంస్కృతిక, సజనాత్మక ఆలోచనల్లో ముందుకు తీసుకువెళ్లనున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఇక్కడ అందిస్తున్న సౌకర్యాలు వినియోగించుకుంటూ తమకు ఇష్టమైన రంగాల్లో రాణించాలని సూచించారు. అంతకుముందు స్కూల్ స్పెషల్ ఆఫీసర్ డా.పి.శంకర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో దాతలు, పూర్వ విద్యార్థుల సహకారంతో ముందుకు వెళ్లి వసతులు కల్పించటానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం, క్రీడా ప్రాంగణాలు విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం విద్యార్థులు నిర్వహించిన సైన్సుఫెయిర్లో అబ్బురపరిచే పలు నమూనాలు ప్రదర్శించారు. వివిధ క్రీడల్లో, సాంసతిక కార్యక్రమాల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఓయూ ఎడ్యుకేషన్ విభాగం హెడ్ ప్రొ. రామకష్ణ సైన్స్ ల్యాబ్ నిర్మాణం కోసం రూ.35 వేలు, రిటైర్డ్ ప్రొఫెసర్ వెన్నెకంటి.ప్రకాష్ రూ. 20 వేల విలువైన బుక్స్ లైబ్రరీకి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మెన్ వెంకటేశ్వర్ రెడ్డి ఉచితంగా క్రీడా పరికరాలు అందజేశారు. కార్యక్రమంలో ఓయూ ఓఎస్డీ ప్రొ. రెడ్యా నాయక్, ఫాదర్ రాఫైల్, ప్రిన్సిపాల్ బి.జ్యోతి శ్రీ, ఓయూ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ ప్రొ.రవీంద్రనాథ్, కె మూర్తి, ప్రొ. మణాళిని, ఎడ్యుకేషన్ హెడ్ రామకష్ణ, జహంగీర్, భిక్షపతి, సుధాకర్, లీనా, ధర్మతేజ, మధుకర్, కష్ణయ్య ఉద్యోగులు పాల్గొన్నారు.