Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెహదీపట్నం
పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం ఆసిఫ్ నగర్ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ నగర నాయకులు విట్టల్, నగర కార్యదర్శి శశికళ మాట్లాడుతూ ఆసిఫ్ నగర్ మండల పరిధిలోని జియాగూడ డివిజన్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న పేద ప్రజలను గుర్తించి వారికి ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తై ఏండ్లు అవుతున్నా పేదలకు ఇండ్లు కేటాయించలేదన్నారు. పేద ప్రజలు ఇల్లు కిరాయిలు కట్టుకోలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వారు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే లబ్దిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించాలని కోరారు. లేకపోతే ఆందోళనను మరింత ఉధతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో భాగ్య, చిన్ని, మంజుల, ఎల్లమ్మ , లావణ, లక్ష్మి, కాశమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.