Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డిని అరెస్టు చేయాలి
- సీపీఐ మండల కార్యదర్శి ఉమా మహేశ్
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్
ప్రధాని మోడీ బుధవారం నిర్వహించిన ముఖ్యమంత్రుల సమీక్షా సమావేశంలో వ్యాట్ తగ్గిస్తున్నామని, రాష్ట్రాల్లో పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించాలని చెప్పడం సమంజసం కాదని, చమురు ధరలనే కేంద్రం తగ్గించాలని సీపీఐ మండల కార్యదర్శి ఉమా మహేశ్ అన్నారు. గురువారం షాపూర్‌నగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ అధికారంలోకి వచ్చిన 2014లో ముడిచమురు ధర బ్యారెల్‌కు రూ.108 ఉంటే ఇప్పుడు రూ.101 ఉందని, కానీ అప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.65-75 ఉంటే, ఇప్పుడు 119-110గా ఉన్నాయని తెలిపారు. ప్రజలు నిజాలను గ్రహిస్తున్నారని, రాబోవు కాలంలో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. తాండూర్ సీఐ రాజేంద్రరెడ్డిని ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తీవ్రస్థాయిలో దూషించడం, నీ సంగతి చూస్తా అని బెదిరించడం ఆయన అహంకారానికి నిదర్శనమని, ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ నాయకులు స్వామి, హరినాథ్, సుంకి రెడ్డి పాల్గొన్నారు.