Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఐటీ హైదారాబాద్ సంచాలకులు ఆచార్య బి.ఎస్. మూర్తి
- జిజ్ఞాస-విద్యార్థి స్టడీ ప్రాజెక్టుల ప్రదర్శన
నవతెలంగాణ-ధూల్‌పేట్
వైజ్ఞానిక తాత్విక చైతన్యాన్ని ప్రపంచానికి అందించిన ఘనత భారతదేశానిదేనని ఐఐటీ హైదారాబాద్ సంచాలకులు ఆచార్య బి.ఎస్. మూర్తి అన్నారు. తెలంగాణ కళాశాల విద్యాశాఖ ఐదేండ్లుగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జిజ్ఞాస-విద్యార్థి స్టడీ ప్రాజెక్టుల రాష్ట్రస్థాయి ప్రదర్శనల ప్రారంభ వేడుక కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అధ్యక్షతన సిటీ కళాశాల అజామ్ హాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శతాబ్దాల పూర్వమే ఎంతోమంది విదేశీ విద్యార్థులు తక్షశీల, నలంద వంటి భారతీయ విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించటం మనకి గర్వకారణం అన్నారు. మహోన్నతమైన చారిత్రక, సాంస్కతిక వారసత్వ సంపదమనకున్నదని, అది ప్రపంచానికి విలువైన పాఠాలు నేర్పించిందన్నారు. సజనాత్మకమైన నూతన ఆవిష్కరణలతో ముందుకు వచ్చే యువతరానికి, ఎప్పుడైనా గౌరవం, పేరు ప్రఖ్యాతలు లభిస్తాయని, ఆ దిశగా అడుగులు వేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అధ్యాపకులు, విద్యార్థుల హదయక్షేత్రాల్లో పరిశోధన బీజాలను నాటి, మానవాళికి ఉపయోగపడే ఫలాలను అందించాలని సూచించారు. డిగ్రీ కళాశాల స్థాయిలోనే స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టులను నిర్వహించి ప్రోత్సాహకంగా భారీ నగదు బహుమతులను అందించటం దేశంలోనే అరుదైన విషయమని ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు 855 ప్రాజెక్టులను రూపొందించటం దేశంలోనే ప్రథమమని అన్నారు. జిజ్ఞాస రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను ఐఐటీ హైదరాబాదుకు ఆహ్వానించి వారి పరిశోధనా కషిని అక్కడి విద్యార్థులకు తెలియజేస్తామని అన్నారు.
పరిశోధనా సంస్కతిని పెంచాలి
డిగ్రీ స్థాయి నుంచే విద్యార్థుల్లో పరిశోధనా సంస్కతిని పెంపొందించాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ అన్నారు. దీంతో విశ్వవిద్యాలయాల్లో పరిశోధనా ప్రమాణాలు మెరుగవుతాయని చెప్పారు. విద్యార్థులకు, అధ్యాపకులకు ఉపయోగపడేలా జిజ్ఞాస స్టడీ ప్రాజెక్టులను రూపకల్పన చేశామని తెలిపారు. సైద్ధాంతిక ఆలోచనను, ప్రయోగాత్మక విజ్ఞానంతో అనుసంధానం చేసినప్పుడే విద్యార్థుల అవగాహనా స్థాయి పెరుగుతుందని వివరించారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
తొలిరోజు ఆంగ్లం, తెలుగు, హిందీ భాషాల్లో 55 ప్రాజెక్టుల ప్రదర్శన, మూల్యాంకనం ఉత్సాహంగా సాగింది. ఆయా ప్రాజెక్టు విద్యార్థులు హుందాతనంతో కూడిన వస్త్రధారణతో, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తమ పరిశోధనా ఫలితాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో అకాడమిక్ గైడెన్స్ అధికారి డి.టి.చారి, కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.బాల భాస్కర్, కళాశాల విద్యాశాఖ అధికారులు డా.రచన, టి.సురేశ్ పాల్గొన్నారు.