Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. సికింద్రాబాద్, బేగంపేట్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్‌లలో తేలికపాటి వర్షం కురిసింది. మారేడుపల్లి, రాణిగంజ్, ఆర్టీసీ క్రాస్‌రోడ్, ప్యారడైజ్, తార్నాక, విద్యానగర్, చిలుకలగూడ, పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మోహదీపట్నం, లంగర్ హౌజ్, కార్వాన్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్ తదితర ప్రాంతా లలోనూ మోస్తారు వర్షం కురిసింది. నగరంలో మధ్యాహ్నం తర్వాత వాతావరణం కొంత మేరకు చల్లబడింది. బీఆర్కే భవన్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, పంజాగుట్ట, బేగంబజార్, ఎంజే మార్కెట్, సుల్తాన్‌బజార్, బషీర్‌బాగ్, హిమాయత్‌నగర్ తదితర ప్రాంతాలల్లో వర్షం పడింది. తార్నాక, మంకేశ్వర్నగర్ మీదుగా విద్యానగర్ వెళ్లే ప్రధాన రహదారి పక్కన చెట్టుకొమ్మ విరిగింది. పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో ఈదురుగాలులు వీయడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఎండల తీవ్రతతో సతమతమవుతున్న నగర వాసులకు కాస్తంత ఉపశమనం కలిగింది. రాష్ట్రంలో రానున్న మూడ్రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడిం చింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది. అక్కడక్కడ ఈదురు గాలులతో వానలు పడతాయని, ఉత్తర తెలం గాణలో నాలుగు రోజులపాటు వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నది.