Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి
నవతెలంగాణ-తుర్కయంజాల్
యువత స్వయం ఉపాధి రంగాలను ఎంచుకొని అభివృద్ధి సాధించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సూచించారు. గురువారం తుర్కయంజాల్లో ఏర్పాటు చేసిన బీ మార్టును ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత ఒకరిపై ఆధార పడకుండా స్వయం ఉపాధి అవకాశాలు దక్కించుకుంటూ అభివద్ధిలో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిసీసీబీ వైస్ చైర్మెన్ కొత్తకుర్మ సత్తయ్య, సహకార బ్యాంక్ డైరెక్టర్ సామ సంజీవరెడ్డి, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ కందాడ ముత్యం రెడ్డి, మాజీ సర్పంచ్ కందాడ లక్ష్మారెడ్డి, మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ కళ్యాణ్ నాయక్, మున్సిపాలిటీ టీఆరెస్ పార్టీ అధ్యక్షుడు వేముల అమరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు కీర్తన విజయానందరెడ్డి, వేముల స్వాతి అమరేందర్ రెడ్డి, ఉదయశ్రీ గోపాల్ రెడ్డి, నాయకులు మోహన్ గుప్త, శేఖర్ గౌడ్, సిద్దాల జంగయ్య, రాజిరెడ్డి, సురేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, కిట్టు, సుదర్శన్ రెడ్డి, బొడ్డు శ్రీనివాస్, రమేష్, దనుంజరు తదితరులు పాల్గొన్నారు.