Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్ ముఠాగోపాల్
- నల్లకుంట వెల్ఫేర్ అసోసియేషన్, హైదరాబాద్ జిందాబాద్ వారి
- ఆహ్వానం మేరకు సమస్యలను పరిశీలించిన ఎమ్మెల్యేలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఓల్డ్ నల్లకుంట, పద్మాకాలనీ, నాగమయ్యకుంటలో వరద నీటి సమస్య నుండి శాశ్వత పరిష్కారం కోసం ''స్లాబ్ నాలా''ను వెంటనే ఏర్పాటు చేయిస్తామని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. గురువారం నల్లకుంట వేల్ఫేర్ అసోసియేషన్, హైదాబాద్ జిందాబాద్ ఆధ్వర్యంలో వారితోపాటు నల్లకుంట కార్పొరేటర్ అమృత హాజరై హెరిటేజ్ వద్ద నాలాను పరిశీలించారు. జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పాత రామాలయం, స్ట్రీట్ నెం.15, 16, ఫీవర్ హాస్పిటల్ ఏరియాలలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగావారు మాట్లాడుతూ... హెరిటేజ్ వద్ద నాలా సైజ్ పెంచి, సగం రామాలయం నాలాకు, సగం నాలాను గాంధీనగర్ లంకా దగ్గర మూసీలో కలుపుతామాని అన్నారు. ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలోని కెనరా బ్యాంక్ వద్ద పెద్ద నాలాకు వేసిన చిన్న పైపులు తీసి శాస్వత పరిష్కారంగా స్లాబ్ నాలా వేయిస్తామన్నారు. భవిష్యత్‌లో వరద సమస్యతో ఏ ఒక్క ఇల్లు కూడా మునుగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అందరినీ అడిగి సమస్యలు తెలుసుకుని జీహెచ్ఎంసీ అధికారులతో వెంటనే చర్చించారు. వీలైనంత తొందరగా ఎవరికీ సమస్య లేకుండా నాలా పనిని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శ్రీనివాస్, ఏఈ రాజు, నల్లకుంట వేల్ఫేర్ అసోసియేషన్ నాయకులు రమేశ్ నాయుడు, బాలకృష్ణారెడ్డి, వినోద్, వెణుగోపాల్, సత్యనారాయణ, వీరయ్య, రీతేష్, శ్రీనివాస్‌రావు, ప్రశాంత్, మధు, లక్ష్మణ్, స్థానిక కాలనీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.