Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు విభాగాల్లో అలరించిన నమూనాలు
- అబ్బుర పరిచిన ప్రాజెక్ట్స్
- ప్రముఖుల హాజరు
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలోని ఆరు విభాగాల్లో రెండు రోజులపాటు జరగనున్న జాతీయస్థాయి టెక్నికల్ సింపోజియాలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్టూడెంట్స్ కలర్ఫుల్ అండ్ ట్రెడీషనల్ డ్రెస్లలో అలరించారు.
ఎలక్ట్రిక్ ఇంజినీరింగ్ టెక్స్స్లోనెన్స్ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మెన్ ప్రొ. ఆర్. లింబాడ్రి పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో నూతన పరిశోధనల్లో ఈ విభాగం విద్యార్థుల కృషి, చొరవ పరిశోధనల గురించి వివరించారు. విద్యార్థులు తమ ప్రతిభ చాటుకునేందుకు ఇది అద్భుతమైన వేదిక అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన పలు ప్రాజెక్ట్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొ. రవీందర్, ప్రిన్సిపాల్ ప్రొ. శ్రీరాం వెంకటేశ్, డీన్ ప్రొ. మల్లేశం, హెడ్ ప్రొ. ఏసురత్నం ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్ ప్రొ. మంగు, మృణాళిని, సుందర్ సింగ్ విద్యార్థులు సాయి చరణ్ రెడ్డి, స్మిత, శైలజ, అర్వింద్ పాల్గొన్నారు.
అలరించిన ఆకృతి
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ హెడ్ ప్రొఫెసర్ ఎల్. నిర్మలా దేవి ఆధ్వర్యంలో ఆకృతి 2022 కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మెన్ ప్రొ. లింబాద్రి పాల్గొన్నారు. దేశంలో ఎంతో వేగంగా ఎలక్ట్రానిక్స్, దాని అనుబంధ రంగాల్లో మార్పులు వస్తున్నాయని, విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుని జీవితంలో రాణించాలని, నూతన పరిశోధనలకు, ఆవిష్కరణలకు ఈ ఆకృతి వేదిక కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీరాం వెంకటేశ్, సీనియర్ ఇంజినీర్ విజేందర్రెడ్డి, హెడ్ ప్రొ.నిర్మలా దేవి, ప్రొ.డి.రామకృష్ణ, విద్యార్థులు రాహుల్, సాయి చరణ్, సౌమిత, అపూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. సాయంత్రం వారు నిర్వహించిన ప్లాష్ మబ్ అలరించాయి.
వైద్య రంగంలో తెలంగాణ ముందు: డా.ఎర్రోళ్ల శ్రీనివాస్
తెలంగాణ రాష్ట్రం వైద్య రంగంలో ఎంతో ముందు ఉందని, అనేక ప్రఖ్యాత ఆస్పత్రులు హైదరాబాద్లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మెన్ డా.ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం బయోమెడికల్ ఇంజినీరింగ్ విభాగంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ''మెడిటెక్ 2022''కు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఓయూ బయోమెడికల్ విద్యార్థులు కరోనా టైమ్లో అందించిన సేవలు ఎంతో గొప్పవని ప్రశంసించారు. మరో వైపు వైద్య పరికరాల తయారీలో, వాటిని వినియోగించే విధానంలో విద్యార్థులు నూతన పరిశోధనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు వైద్య సేవలు, పరీక్షల స్టాల్స్, ప్రాజెక్టులను పరిశీలించారు. టీఎస్ఎంసీ సభ్యులు డా. చిన్నాడి, అమిత్ కుమార్, వైద్య నిపుణులు అందిస్తున్న వస్తున్న మార్పులు విద్యార్థులు అందించాల్సిన కృషి చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీరాం వెంకటేశ్, హెడ్ డా.డి.సుమన్, కో ఆర్డినేటర్ శ్రవన్య, డా.మెడి శ్రీనివాస్ విద్యార్థులు కార్తిక్ రెడ్డి, శ్రీమేధా, వివేక్ వర్ధన్ విద్యార్థులు పాల్గొన్నారు.