Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు
- నిమ్స్ ఆస్పత్రిలో జనరల్ బాడీ సమావేశం
నవతెలంగాణ-బంజారాహిల్స్
మే డే తర్వాత కార్మికుల జీతాలు పెంచుకుంటే ఉద్యమిస్తామని సీఐటీయూ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు ఈశ్వరరావు అన్నారు. సీఐటీయూ కార్మిక సంఘాలు ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోకుండా కాలయాపన చేస్తే తమ నిరసన కార్యక్రమాలను ఉధతం చేస్తామని శుక్రవారం నిమ్స్ ఆస్పత్రి ఆవరణలో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో తీర్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 15-20 ఏండ్లుగా నిమ్స్ ఆస్పత్రిలో సేవలందిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తుందో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రభుత్వం చేసిన హామీలను నెరవేర్చాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసినా వాటిని అమలు చేయకపోవడం దుర్మార్గమన్నారు. తమ ప్రధాన డిమాండ్లు జీతాల పెంపుదల, కనీస వేతనం రూ. 21వేలు, సీనియార్టీ ప్రకారం పర్మినెంట్ చేయాలని నిమ్స్ డైరెక్టర్‌ను కోరామని చెప్పారు. స్పందించిన ఆయన సమస్యలన్నీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకు వెళ్లామని చెబుతున్నారని సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే నిరసనలు తప్పవని హెచ్చరించారు. యూనియన్ జనరల్ సెక్రెటరీ బాలయ్య, ట్రెజరర్ డేవిడ్ వెంకటేష్, శీను, ప్రవీణ్,రాధిక, లక్ష్మి, రాణి పాల్గొన్నారు.