Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షపునీటి మ్యాన్‌హోల్స్ పైకప్పులు ఏర్పాటు చేయాలని సీపీఐ(ఎం) ఆందోళన
నవతెలంగాణ-ఉప్పల్
ఉప్పల్‌లో అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వం ప్రజల పాలిట శాపంగా మారింది అని సీపీఐ(ఎం) కార్యదర్శి ఎర్రసేన అన్నారు. వర్షపునీటి మ్యాన్‌హోల్స్ పైకప్పు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో శుక్రవారం రామంతాపూర్‌లో కాలనీవాసులతో కలిసి ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన 'రామంతాపూర్‌లోని చర్చికాలనీ ప్రధాన రహదారిపై వర్షపు నీరు వెళ్లేందుకు మ్యాన్‌హోల్స్ నిర్మించారు. పైకప్పు నాణ్యత లేకపోవడంతో కొద్దిరోజులకే పాడైపోయింది. దీనిపై గత రెండునెలలుగా అధికారులకు చెప్పినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. పాడైపోయిన కాలువ పైకప్పు రోడ్డులో మధ్యలో ఉండటం వల్ల వచ్చిపోయే వాహనాలకు పాదచారులకు ఇబ్బందికరంగా మారింది. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు. ఎన్నికలప్పుడు ఇంటింటికి వచ్చి ఓట్లు అడుక్కునే పాలకులు ఈ దారిలో వెళ్లినప్పటికీ ఈ సమస్య వారికి కనిపించడం లేదు' అని కాలనీవాసులు నిరసన వ్యక్తంచేశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని, లేకపోతే కాలనీవాసులతో జీహెచ్ఎంసీ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు చిన్నారావు, రత్నాకర్ రెడ్డి, రాయన్న, జోసఫ్, వినోద్, అలెగ్జాండర్ కాలనీవాసులు పాల్గొన్నారు.