Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఎఫ్టీయూ అధ్యక్షులు ఎస్ ఎల్ పద్మ
నవతెలంగాణ-ఓయూ
కనీస వేతనాల సాధన, అధిక ధరల నియంత్రణ కోసం నిరంతరం పోరాడుదామని ఓయూ ఐఎఫ్టీయూ అధ్యక్షులు ఎస్ఎల్ పద్మ పిలుపునిచ్చారు. ఐఎఫ్టీయూ అనుబంధ ప్రోగ్రెసివ్ అండ్ క్యాజువల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఓయూ లేడీస్ హాస్టల్ వద్ద మే డే పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఓయూ హాస్టల్స్ ఉద్యోగులకు మూడేండ్లుగా యూనివర్సిటీ అధికారులు వేతనాలు పెంచకపోవడం దుర్మార్గమని, ధరలు 200 శాతం పెరిగి బతకలేని పరిస్థితిలో వారు నెట్టబడ్డారు అని ఆవేదన వ్యక్తంచేశారు. కాంట్రాక్ట్, పర్మినెంట్, టైం స్కేల్ ఉద్యోగులందరికీ జీతాలు పెంచి ఏరియర్స్‌తో సహా చెల్లించిన యూనివర్సిటీ హాస్టల్స్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎందుకు జీతాలు పెంచడం లేదని ప్రశ్నించారు. మేడేలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచారు. కార్యక్రమంలో యూనివర్సిటీ నాయకులు శంకర్, భారతి, విజయ, జయ, సురేష్, లక్ష్మణ్, లక్ష్మీదేవి పాల్గొన్నారు.