Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
రాష్ట్రంలో నేతన్నలకు రూ.5 లక్షల బీమా అమలు కోసం జీవోను విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సంసిద్ధతతో కూడిన డ్రాఫ్ట్‌ను వెలువరించడం హర్షించదగ్గ విషయమని బీసీ సంక్షేమ సంఘం నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేష్ అన్నారు. శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడేండ్లుగా నేతన్నల సమస్యల పట్ల వివిధ రూపాల్లో ఉద్యమిస్తున్నామని, అందుకు ఫలితంగా నేడు నేతన్నలకు రూ.5 లక్షల బీమా ఇవ్వడానికి సీఎం కేసీఆర్ సంసిద్ధంగా ఉండటం హర్షణీయమన్నారు. చేనేత వత్తి బతకాలంటే వత్తిని కొనసాగించే వారికి 18 ఏండ్ల వయస్సు నుంచే నెలకు రూ.3,016 పెన్షన్ అందించాలన్నారు. మార్కెట్ అవకాశాలను విస్తతం చేస్తూ నకిలీల చేనేత ఏరివేతను చేపట్టాలని, కార్పొరేట్ వస్త్రాలయాల ఆగడాలను అడ్డుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏడేండ్లలో చనిపోయిన 350 మందికి ఎక్స్ గ్రేషియాతో పాటు సొంత ఇంటి వసతి ఏర్పాటు చేయాలని కోరారు. బీమా పొందేందుకు నిర్ణయించిన 59 ఏండ్ల ఏజ్ లిమిట్‌ను 70 ఏండ్లకు పెంచాలని విజ్ఞప్తిచేశారు. బీసీ బిల్లుకై నిర్వహించే తమ పోరాటానికి జాతీయంగా సహకారం అందిస్తామని టీఆర్ఎస్ హామీ ఇవ్వడం శుభపరిణామన్నారు. రాష్ట్రంలో వెలువడిన ఉద్యోగ నోటిఫికేషన్లలో పోటీపడే బీసీ అభ్యర్థులకు క్రిమిలేయర్ సర్టిఫికెట్‌ను ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మార్వోలు త్వరితగతిన అందజేయాలని ఆయన కోరారు.