Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
ప్రేమ భావాలను కలిపేదే ఇఫ్తార్ విందులని రిటైర్డ్ ఆఫీసర్ షేక్ అబ్దుల్ రవుఫ్ అన్నారు. ఆవాజ్ సౌత్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఐక్యమత్యం, లౌకికవాదం అవసరమని, దానికోసం హిందూ, ముస్లిం సిక్కు, క్రిస్టియన్లు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. పాతబస్తీలో విద్య, వైద్యంపై ప్రత్యేక దష్టి పెట్టాలని దానికోసం పాలకులు ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివద్ధికి తోడ్పడాలని సూచించారు. నగర కార్యదర్శి అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ ముఖ్యంగా హిందూ, ముస్లిం, సాయి భారు భారు అని కేవలం ప్రకటనల వరకే కాకుండా హైదరాబాద్‌ని గుర్తు చేసేటట్టుగా ఐక్యమత్యంగా ఉండాలన్నారు. అందరూ కలిసి ఇఫ్తార్ విందు నిర్వహించుకోవడం పట్ల సంతోషం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సంతోష్ నగర్ సీఐ, ఎస్సైలు, స్థానిక నాయకులు, సామాజిక కార్యకర్తలు, ఆవాజ్ నాయకులు అబ్దుల్ లతీఫ్, బాలు నాయక్, కోటయ్య, కలీముద్దీన్, గులాం నశీర్, మహ్మద్ బాబా మియా, జాబ్ తదితరులు పాల్గొన్నారు.