Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
ఎండాకాలాన్ని దష్టిలో పెట్టుకుని నీటి సరఫరాలో ఇబ్బందులు లేకుండా జల మండలి అధికారులు చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, కార్పొరేటర్ ఇ.విజరు కుమార్‌గౌడ్ అన్నారు. శుక్రవారం అంబర్‌పేట డివిజన్ పరిధిలోని పటేల్‌నగర్, ప్రేమ్నగర్లలో ఇంటింటికి తిరుగుతూ నీటి సరఫరాలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లో ప్రెషర్ నీటి సరఫరా, కలుషిత నీటి సమస్యలు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తన దష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు కషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు సంతోష్వారి తదితరులు పాల్గొన్నారు.