Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆద్య వ్యవస్థాపకులు లక్ష్మి
నవతెలంగాణ-బంజారాహిల్స్
కార్మిక కర్షకుల కష్టాలను దూరం చేయడానికి తన వంతు సహకారం అందిస్తూ వారికి గుర్తింపుని ఇవ్వడానకి ఆద్య స్టోరే నిదర్శనమని వ్యవస్థాపకులు లక్ష్మి అన్నారు. శుక్రవారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఆద్య చేనేత చీరల దుకాణాన్ని సహా నిర్వాహకులు రామకృష్ణతో కలిసి ప్రారంభించారు. చేనేత కార్మికులను, వారి సంఘాలను పటిష్టపరిచే దిశగా సురక్షితమైన స్థిరమైన వేదికను అందిస్తూ పాత సంప్రదాయాన్ని పునరుద్ధరించే దక్పథంతో సంప్రదాయం, హస్తకళల మధ్య సహకారాన్ని పెంపొందించడమే ఆద్య సామాజిక లక్ష్యమని చెప్పారు. చీరలను కేవలం 'వద్ధులు' లేదా 'వత్తిపరులు' మాత్రమే ధరిస్తారనే అపోహలను తొలగించే దిశగా చేనేత వర్గానికి దోహదపడుతామని చెప్పారు. ఆద్య కలెక్టివ్ పేరుకు తగ్గట్టుగానే నవ్యాంధ్రప్రదేశ్, నవ తెలంగాణ రాష్ట్రాలతో సహా భారతదేశంలోని వైవిధ్యభరితమైన ఎన్నో రకాలకు చెందిన చేనేత ఉత్పత్తులను మీ ముందుకు తీసుకువస్తోందని ఆమె తెలిపారు. theaadyacollective.com అనే వెబ్సైట్ ద్వారా వస్త్రాలు కొనుగోలు చేయవచ్చు అని సూచించారు.