Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రోటరీ క్లబ్ ఎప్పుడూ ముందు ఉంటుందని రోటరీ అంతర్జాతీయ అధ్యక్షుడు శేఖర్ మెహతా అన్నారు. అర్ఐ మాజీ డైరెక్టర్ కమల్ సంఘ్వి, చైర్మెన్, వరల్డ్ రోటరాక్ట్ చైర్ అగ్రశ్రేణి రోటరీ క్లబ్ డిగ్నిటరీస్తో రవి వడ్లమాని కలిసి చైర్మెన్ మల్లారెడ్డి హెల్త్ సిటీ,డా.భద్రారెడ్డి, ఎండీ మల్లారెడ్డి హెల్త్ సిటీ, డాక్టర్ సీహెచ్.ప్రీతి రెడ్డి, తమ సీనియర్ డాక్టర్ల బందంతో ఆంకాలజీ మొబైల్ సేవలను శుక్రవారం ప్రారంభించారు. మొబైల్ ఆంకాలజీ యూనిట్ ప్రధానంగా మారుమూల గ్రామీణ సెమీ-అర్బన్ ప్రదేశాల్లో క్యాంపులను నిర్వహిస్తుందని వెల్లడించారు. మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మెన్ డా.భద్రారెడ్డి మాట్లాడుతూ 750 పడకల సామర్థ్యం ఉన్న ఆస్పత్రిలో 200 పడకలతో కూడిన ఏడు ఐసీయూలు ఉన్నాయన్నారు. అత్యవసర వైద్య సిబ్బంది 30 పడకల యూనిట్ ఎమర్జెన్సీ మెడికల్, సర్జికల్ అవసరమయ్యే వ్యక్తుల కోసం 24 గంటలూ అందుబాటులో ఉంటుందన్నారు. ఆస్పత్రిలో రెండు క్యాథ్ ల్యాబ్ యూనిట్లు, 30 డయాలసిస్ యూనిట్లు, 12 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. అత్యంత నిబద్ధత కలిగిన 1100 మంది ప్రొఫెషనల్ కన్సల్టెంట్ వైద్యులు, 800 మందికి పైగా పారామెడికల్ సిబ్బంది ఇతర సహాయక విభాగాలు కార్మికులు రోగులకు ఉత్తమమైన సేవలు, సంరక్షణను అందించడానికి నిరంతరం కషి చేస్తారని వివరించారు. కార్యక్రమంలో రమేష్ వంగాల, ఉజ్వల్ కుమార్, సరితా అగర్వాల్, పూరవ్ గాలా,్ల కె.ప్రభాకర్, వాసుదేవ్ చతుర్వేది పాల్గొన్నారు.