Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
మే డే సందర్భంగా ప్రభుత్వం ప్రదానం చేసిన శ్రమశక్తి అవార్డును రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చమకూన మల్లారెడ్డి చేతులమీదుగా తెలంగాణ ప్రవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇన్స్ట్రుక్టర్ రాజు మహారాజ అందుకున్నారు. ఆదివారం రవీంద్రభారతిలో అవార్డు ఆదుకోవడం పట్ల కార్మిక సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని పాలుమార్లు కోరిన వారిలో మొదటి వ్యక్తి రాజు మహా రాజు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నక్కా యాదగిరి, నేమాల బెనర్జీ, ఉదయ భాస్కర్, రాజు మహారాజ బ్రదర్స్ రవింద్రచారి, సురేష్ చారి పాల్గొన్నారు.