Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఖిల భారత ఓబీసీ ఉద్యోగ సంఘాల డిమాండ్
నవతెలంగాణ-అడిక్‌మెట్
బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని విద్యా, ఉద్యోగాలపై ఉన్న క్రిమిలేయర్ నిబంధన తొలగించాలనీ, జనాభా గణనలో కుల గణన చేపట్టాలని అఖిల భారత ఓబీసీ ఉద్యోగ సంఘాల డిమాండ్ చేశాయి. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన అఖిల భారత ఓబీసీ ఉద్యోగుల ఉన్నత స్థాయి సమావేశం చెన్నైలో నిర్వహి ంచారు. ఈ సమావేశానికి దేశంలోని 29 రాష్ట్రాల నుంచి, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ పాల్గొన్నారు. ఈ సమావేశానికి బీసీ ఉద్యోగ సంఘాల నాయకులతో పాటు బీసీ సంఘాల నాయకులు, అఖిల పక్ష రాజకీయ నాయకులను, 29 రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, 30 ఓబీసీ ఉద్యోగ సంఘాలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి తమిళనాడు రవాణా శాఖ మంత్రి శివ శంకర్, ద్రావిడ కజగం అధ్యక్షులు కె.వీరమని, పార్లమెంటు సభ్యులు ఏలంగో, తిరుమ వలన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్‌కృష్ణ, గ్రేటర్ హైదరాబాదు అద్యక్షులు నీరడి భుపేష్ సాగర్ హాజరయ్యారు. ఈ సందర్భగా ఆర్.కృష్ణయ్య మాట్లాడు తూ బీసీల ఉద్యమానికి బీసీ ఉద్యోగులు నాయకత్వం వహించాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులు ఐకమత్యంగా ఉద్యమిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. దేశ జనాభాలో 56 శాతం జనాభా గల బీసీలు కులాల పేరు మీద విడిపోవడం వల్ల న్యాయమైన డిమాండ్లు సాధించ లేకపోతున్నారు. బీసీల్లో భావధ్యనం భావిస ఆలోచన విధానం పోవాలన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టడానికి చట్టపరమైన, రాజ్యంగా పరమైన, న్యాయపరమైన అవరోధాలు, అడ్డంకులు ఏమీలేవన్నారు. రాజ్యాంగ బద్ధమైన మండల్ కమీషన్ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫార్సు చేసిందని తెలిపారు. చట్టబద్దమైన పార్లమెంటరీ కమిటీ చైర్మన్ నాచి యప్పన్ కమిటీ బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వే షన్లు పెట్టాలని సిఫార్సు చేసిందనీ, ఇక ఇటీవల సుప్రీం కోర్టు ఉత్తరప్రదేశ్ రిజర్వేషన్ల కేసు సందర్భంగా జనాభా ప్రకారం బీసీ ఉద్యోగుల సంఖ్య లేకపోతే ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని తీర్పు చెప్పినట్టు గుర్తు చేశారు. అన్ని వైపుల నుంచి బీసీ ఉఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలని సిఫార్సులున్నాయి. ప్రమోషన్లలలో రిజర్వేషన్లు పెట్టడానికి ఎలాంటి అవరోధాలు లేవన్నారు. ప్రజాస్వామ్య దేశం అన్ని రంగాల్లో ముఖ్యంగా విద్య, ఉద్యోగ, రాజకీయ, సాంఘిక, ఆర్థిక రంగాల్లో బీసీల జనాభా ప్రకారం వారి వాటా వారికి ఇవ్వాలి కానీ 74 ఏండ్ల తర్వాత కూడా దేశంలోని 50 శాతం జనాభా గల బీసీలకు ప్రజాస్వామ్య వాటా ఇవ్వకుండా అణచి వేస్తున్నా రన్నారు. బీసీల న్యాయమైన సమస్యల పరిష్కారానికి కలసికట్టుగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని వారు తెలిపారు.