Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజలకు మౌళిక వసతులు కల్పిస్తామని నాగారం మున్సిపల్ చైర్మన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మున్సిపల్ పరిధిలోని 7వ వార్డు బ్రహ్మయ్య కాలనీ రోడ్డు నెంబర్ 5 , ఈశ్వర పూరి కాలనీలో మున్సిపల్ నిధులు రూ.9 లక్షలతో చైర్మన్తో పాటు స్థానిక కౌన్సిలర్ గూడూరు సబితఆంజనేయులు గౌడ్ పనులకు శంఖుస్థాపన చేశారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూనాగారం మున్సిపల్లో ప్రజలకు దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు మధు గౌడ్ పాల్గొన్నారు.