Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్ నియోజకవర్గంలో దళిత బందు లబ్దిదారులు ఆదివారం సంబురాలు నిర్వహించారు. నియోజకవర్గానికి చెందిన వంద మంది ''దళిత బంధు'' లబ్దిదారులకు తమ తమ బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున డబ్బులు జమ కావడంతో ఎమ్మెల్యే సాయన్న క్యాంపు కార్యాలయం వద్ద సంబురాలు నిర్వహించారు. లబ్దిదారులు ఎమ్మెల్యే సాయన్న అధ్యక్షతన బాణాసంచా కాల్చారు. మిఠాయిలు పంచుకున్నారు. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం లబ్దిదా రులు ఎమ్మెల్యే సాయన్నను సన్మానించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం 100 మంది లబ్దిదారులకు రూ.10 కోట్లు జమైనట్టు తెలిపారు. దళిత బంధు దళితుల జీవితంలో కాంతి రేఖలు నింపిందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు నివేదిత, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపా ధ్యక్షుడు జక్కుల మహేశ్వర రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు నళిని కిరణ్, ప్యారసాని శ్యామ్ కుమార్, లోకనాద్, ప్రభాకర్, పాండు యాదవ్, మాజీ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్, ముప్పిడి మధుకర్, పింజర్ల మురళి యాదవ్, పిట్ల నాగేష్ , నాగినేని సరితా, ధనరాజ్, నర్సింహా రావు, వినోద్ కుమార్, తేజ్ పాల్, కిరణ్ కుమార్, శరవీ, భాస్కర్ ముదిరాజ్, పెంట శ్రీహరి, నీరజ్, పనస సంతోష్, ఉమా శంకర్, పద్మావతీ, రాజయ్య, జోడి బ్రదర్స్, విశ్వనాథ, జైరాం, తదితరులు పాల్గొన్నారు.