Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మెహిదీపట్నం బ్రాంచ్ ఆధ్వర్యంలో శనివారం నిరుపేదలకు ఆహార కిట్లను పంపిణీ చేశారు. పోచమ్మ బస్తీలో శనివారం హుమాయున్‌నగర్ సీఐ నర్సింహారెడ్డి వీటిని 400 మంది పేదలకు అందజేశారు. ఈ సందర్భంగా మెహిదీపట్నం స్టోర్ హెడ్ రమీజ్ మాట్లాడుతూ మల్బార్ గ్రూప్ తమ లాభాల్లో ఐదు శాతాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతున్నదని తెలిపారు. గడిచిన ఐదేండ్ల లో కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రెండు తెలుగు రాష్ట్రాల్లో 15,000 మందికి రూ.4.5 కోట్ల విలువైన ఉపకార వేతనాలను అందజేసినట్టు తెలిపారు. 20 ఏండ్లలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఆరు లక్షల మందికి పైగా నిరుపేదలకు వైద్యసాయం అందించిందన్నారు. కా ర్యక్రమంలో మేనేజర్లు జావీద్, నయీమత్ పాల్గొన్నారు.