Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షులు ఎ.విజరుకుమార్
నవతెలంగాణ-సిటీబ్యూరో
మే డే స్పూర్తితో అందరికీ విద్యా, ఉపాధి కోసం ఉద్యమిద్దామని డీవైఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షులు ఎ.విజరుకుమార్, రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ పిలుపునిచ్చారు. ఆదివారం డివైఎఫ్ఐ హైద్రాబాద్ సెంట్రల్ సిటీ జిల్లా విస్త్రృత స్థాయి సమావేశం నగర కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలని నిరుద్యోగులకు మాయమాటలు చెప్పి నేడు దేశంలోనే గతంలో ఎన్నడూ లేనంత నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తుందన్నారు. మరో వైపు పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచు తూ ప్రజలపై భారాలు మోపుతున్నారన్నారు. దేశవ్యాప్తంగా 60 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయకుండా నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. రాబోయే కాలం లో యువతకి ఉద్యోగాలు రాకుండా అన్ని ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటీకరణ చేస్తుం దని ఆవేదన వ్యక్తం చేశారు. మేడే స్ఫూర్తితో యువత తమ హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితిని ఐదేండ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డీవైఎఫ్ఐ జిల్లా నాయకులు ఎండీ.జావీద్, నిరంజన్, వై.శ్రీను, క్రిష్ణ, చింతల శ్రీను, సాయి, శతి, నవీన్, కునాల్, గోపి, మల్లిఖార్జున్, రాజేష్, ప్రశాంత్, రాజు, యూసఫ్ పాల్గొన్నారు.