Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
దళితబంధు పథకానికి ఎంపికైన లబ్దిదారులకు వెంటనే వాహనాలను అందజేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ కోరారు. శనివారం కలెక్టర్ చాంబర్లో రవాణా వాహనాల డీలర్లు, జిల్లా రవాణా విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దళితబంధు పథకంలో సుమారు 40శాతం మంది లబ్దిదారులు రవాణా వాహనాలు ఎంపిక చేసుకు న్నారనీ, ఆ వాహనాలను త్వరితగతిన లబ్దిదారులకు అందజేయాలన్నారు. వాటికి సంబంధించి ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని వివిధ కంపెనీలకు సంబంధించిన డీలర్లకు సూచించారు. ఈ సమావేశంలో ఖైరతాబాద్ ఆర్టీవో ఎల్.రాంచందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేష్, వివిధ కంపెనీలకు చెందిన డీలర్లు పాల్గొన్నారు.