Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.2 కోట్ల 30 లక్షల రూపాయల అభివద్ధి పనులకు శ్రీకారం
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-మీర్పేట్
అన్ని కాలనీల అభివృద్ధే ప్రభుత్వ ప్రథమ లక్ష్యం అని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలోని 9, 18, 20, 21 ,40 డివిజన్లలో 2 కోట్ల 30 లక్షల రూపాయల అభివద్ధి పనులకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రణాళికా బద్దంగా అన్ని కాలనీలలో అభివద్ధి పనులు జరుగుతున్నా యని తెలిపారు. గత ఏడాది మాదిరిగా వర్షం వస్తే ముంపునకు గురికాకుండా చెరువులను లింకు చేస్తూ నాలాలను ఏర్పాటు చేస్తున్నట్లు పనులు సైతం ప్రారంభం అయ్యాయని, త్వరలో పూర్తి అవుతాయని, శాశ్వతంగా ముంపు సమస్య పరిష్కారం అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రారంభించిన పనులు మంచినీటి పైపులైన్, పక్కా ప్రణాళిక డ్రైనేజీ వ్యవస్థ, సీసీి రోడ్ల నిర్మాణానికి కేటాయించి అట్టి పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని అధికారు లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కమిషనర్ నాగేశ్వర్, డిఈ గోపీనాథ్, హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు, ప్లోర్ లీడర్ అర్కల భూపాల్ రెడ్డి, మాజీ ఎంపీపీ సిద్ధాల లావణ్య బీరప్ప, స్థానిక కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు బూపేష్ గౌడ్, వివిధ కాలనీవాసులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.