Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
చిల్కానగర్ డివిజన్లోని శ్రీనగర్ కాలనీలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్ అన్నారు. ఆదివారం కాలనీ అధ్యక్షుడు కొండయ్య కాలనీ సభ్యుల అభ్యర్థన మేరకు శ్రీనగర్ కాలనీలో అండర్ డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కషి చేయాలని కాలనీ అసోసియేషన్ సభ్యులు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ దష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మరియు కార్పొరేటర్ గీత సహకారంతో కచ్చితంగా శ్రీనగర్ కాలనీలో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు కొండయ్య ప్రధాన కార్యదర్శి ఐలయ్య, వెంకటేష్, సాయి, కొండల్, మల్లేష్, శ్రీహరి రెడ్డి, శ్రీనివాస్, రాము, రామకష్ణ, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు.