Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులతో చెరువుల సుందరీకరణ, మరమ్మతు పనులు ముమ్మరంగా సాగుతున్నాయని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం లోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఆల్మాస్గూడ గ్రామంలోని కోమటికుంట, పోచమ్మకుంట చెరువు సుందరీకరణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో కోట్లాది రూపాయల నిధులతో చెరువుల సుందరీకరణతో పాటు మరమ్మతులు చేపట్టి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కషి చేస్తున్నారని తెలిపారు. దీనితో లక్షలాది మంది రైతులు, మత్శ్యకార్మికులకు జీవనోపాధి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహా రెడ్డి, టీిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి, స్థానిక కార్పొరేటర్లు సంరెడ్డి స్వప్న వెంకట్ రెడ్డి, బోయపల్లి దీపీక శేఖర్ రెడ్డి, ఏనుగు రాంరెడ్డి, లలిత కష్ణ, డీఈ అశోక్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.