Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
ఉప్పల్ భగాయత్ ప్లాట్ల యజమానుల సమస్యల పరిష్కారం కోసం అభివద్ధి కోసం యజమానుల సంఘం ఆధ్వర్యంలో లక్ష్మారెడ్డి కాలనీలో భగాయత్ ప్లాట్ యజమానుల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కొన్ని ముఖ్యమైన తీర్మానాలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా. ప్లాట్ల యజమానులు మేకల శివారెడ్డి, గోనే అర్జున్‌రెడ్డి, మేకల హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ భగాయత్‌లో మౌలిక వసతులు కల్పించాలని, భగాయత్ అభివద్ధికి కషి చేయాలని కోరారు. అనంతరం ఉప్పల్ భగాయత్ అడక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అడక్ కమిటీ కన్వీనర్‌గా మేకల మధుసూదన్‌రెడ్డిని ఎన్నుకున్నారు. కమిటీ ముఖ్య సలహాదారులుగా దుబ్బ నరసింహారెడ్డి మేకల శివారెడ్డి, సల్లా రాజి రెడ్డి, గోనె అర్జున్‌రెడ్డి, బి.రాములుగౌడ్, మేకల హనుమంత్ రెడి,్డ దాస్‌గౌడ్, సల్ల వీరా రెడి అదేవిధంగా అసోసియేషన్ మెంబర్‌షిప్‌కు వెయ్యి రూపాయలు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ భగాయత్ ఫ్లాట్స్ యజమానులు అందరూ పాల్గొన్నారు.