Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజలకు మౌళిక వసతులు కల్పిస్తామని నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు భాగ్యనగర్ కాలనీలో రూ.5 లక్షలతో ప్రహరీ గోడ నిర్మాణానికి చైర్మెన్ శంకుస్థాపన చేసి మాట్లాడారు. కాలనీల పరంగా విస్తరిస్తున్న నాగారం మున్సిపాలిటీలో దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ అన్నంరాజు లావణ్య శ్రీనివాస్, కౌకుట్ల అనంత్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.