Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ చైర్ పర్సన్ అండ్ చీఫ్ జడ్జి రేణుక యార ఆదేశాల మేరకు పారా లీగల్ వాలంటీర్ల శిక్షణలో భాగంగా సీనియర్ సివిల్ జడ్జి, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె. మురళీ మోహన్ ఆధ్వర్యంలో గురువారం నూతన పారా లీగల్ వాలంటీర్ల బృందం హైదరాబాద్ కేంద్ర కారాగారాన్ని, ప్రత్యేక మహిళా జైలును సందర్శించింది. అక్కడ ఖైదీలకు అందుతున్న న్యాయ సేవలను, సౌకర్యాలను పరిశీలించింది. మహిళా జైలు సూపరింటెండెంట్ లక్ష్మీ శ్రీనాథ్, డిప్యూటీ సూపరింటెండెంట్ అమరావతి, డిప్యూటీ జైలర్ శృతి, కేంద్ర కారాగారం జైలర్ సుభాష్ తదితరులు పారా లీగల్ వాలంటీర్లకు కారాగారంలో సమకూరుస్తున్న వసతులను, ఖైదీల సౌకర్యాలను వివరించారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న నూతన పారా లీగల్ వాలంటీర్ల శిక్షణ లో భాగంగా న్యాయ సేవకుల బృందం కేంద్ర కారాగారాన్ని, మహిళా కారాగారాన్ని, బాలుర అబ్జర్వేషన్ హౌమ్, చిల్డ్రన్ హౌమ్, పోలీస్ స్టేషన్, ఫ్యామిలీ కోర్ట్, సఖి కేంద్రాలను సందర్శించి పలు విషయాలపై అవగాహన పొందారు. ఈ కార్యక్రమంలో సిటీ సివిల్ కోర్టు న్యాయసేవాధికార సంస్థ సూపరింటెండెంట్ సునీత, సీనియర్ అసిస్టెంట్ శైలజ, లీగల్ వాలంటీర్లు రాజు, సరోజ పాల్గొన్నారు.