Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
అవినీతి రహిత రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించడానికి ఎన్ఎస్యూఐ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జి జక్కిడి ప్రభాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఎన్ఎస్యూఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వినరు పటేల్ జైలు నుంచి విడుదలైన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి పాలనపై కాంగ్రెస్ శ్రేణులు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారనీ, దీనికి యువత ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎస్సీ సెల్ చైర్మెన్ రమేష్, ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, సామల రెడ్డి, మహేందర్, వనస్థలిపురం మాజీ అధ్యక్షుడు కిరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.