Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నగర పేరు, ప్రతిష్టతలు పెంచాలి
- నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్
- పబ్‌లు, బార్లు, రెస్టారెంట్ల యజమానులతో ప్రత్యేక సమావేశం
నవతెలంగాణ-సిటీబ్యూరో
డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి ప్రపంచంలోనే అత్యంత సురక్షితమై నగరంగా పేరు ప్రతిష్టత మరింత పెంచేందుకు అందరం కలిసికట్టుగా పని చేయాలని సీవీ ఆనంద్ పిలుపుని చ్చారు. సిటీ పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం బార్స్, రెస్టారెంట్స్, పబ్బుల యజమానులతో సీపీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలోని శాంతి భద్రతలు బాగున్నాయనీ, మహిళల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బార్లు, పబ్‌లు, రెస్టారెంట్స్‌తో ఇతరులకు ఇబ్బందులు కలుగొద్దనీ, భారీ శబ్దాలతో కూడిన మ్యూజిక్‌లను పెట్టొద్దన్నారు. నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. అన్ని క్లియరెన్స్‌ను ఆన్లైన్లోనే ఇస్తున్నామని తెలిపారు. కొంతమంది బార్లు, పబ్బుల యజమా నులు లాభాల కోసం నిబంధనలను ఉల్లంఘించి నగరానికి చెడ్డపేరు తెస్తున్నారనీ, ఇది తగదని హెచ్చరించారు. ఈ సందర్భంగా వారికి సిటీ పోలీస్ యాక్ట్ గురించి వివరించారు. నగరవాసులకు ఇబ్బందులు తలెత్తకుండా నడుచుకోవాలని సూచించారు. మైనర్లను పబ్బుల్లోకి అనుమతిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 30 రోజుల బ్యాకప్ గల సీసీ కెమరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కస్టమర్లను తరుచూ మానిటరింగ్ చేసేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రి 11 గంటల తర్వాత వచ్చిన ఆర్డర్లను తీసుకోవద్దనీ, 12 గంటలలోపు మూసేయాలని ఆదేశిం చారు. శని, ఆదివారాల్లో లావాదేవీలను లెక్కింపులను దృష్టిలో పెట్టుకుని అరగంట గ్రేస్ పీరియడ్‌తో పాటు అదనంగా 1 గంట మినహాయింపు ఉంటుందన్నారు. పది నిమిషాల ముందు లైట్లను డిమ్ చేస్తే పబ్బు మూసే సమయమైందని కస్టమర్లు తెలుసు కుంటారని సూచించారు. అంతర్జాతీయ ప్రయాణికులు, ప్రతిని ధులను దృష్టిలో ఉంచుకుని స్టార్ రేటింగ్ ఉన్న హౌటళ్లలో 24 గంటల పాటు మద్యం అందుబాటులో ఉంటుందన్నారు. త్వరలోనే సిటీ పోలీస్ వెబ్సైట్ ద్వారా లైసెన్స్ పునరుద్ధరణలు, ఇతర లైసెన్సుల కోసం సులభంగా దరఖాస్తు చేసుకునే విధంగా సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ సీపీ ఏ.ఆర్.శ్రీనివాస్, జాయింట్ సీపీలు ఎం.రమేశ్ ఎస్.బి పి.విశ్వప్రసాద్, 5 జోన్లకు చెందిన డీసీపీలు, పోలీసు అధికారులు, 100 మందికి పైగా సంస్థల యజమానులు, తదితరులు పాల్గొన్నారు.