Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు మున్సిపల్ పాలకవర్గం కృషి చేస్తుందని నాగారం మున్సిపల్ చైర్మెన్ కౌకుంట్ల చంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని రాంపల్లి గ్రామంలోని రెండో వార్డులో మున్సిపల్ నిధులు రూ.7 లక్షలతో ప్రభాకర్ రెడ్డి కాలనీలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఛైర్మెన్ మాట్లాడుతూ దశల వారీగా అభివృద్ధి పనులు చేపడుతు న్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బి.మల్లేష్ యాదవ్, కౌన్సిలర్ ఎలిజాల నగేష్గౌడ్, గోక కళావతి యాదగిరి, గండి ఆంజనేయులు గౌడ్, గూడూరు ఆంజనేయులు, పెంటయ్య, మచ్చ శీను పాల్గొన్నారు.