Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, దాని అనుబంధ సంస్థల్లో ఉపాధ్యాయ నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, స్థానిక రిజర్వేషన్లు పాటించాలని కోరుతూ శుక్రవారం హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఎల్ శర్మన్ను కలిసి బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు విక్రమ్ గౌడ్ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లోని ప్రఖ్యాత విద్యా సంస్థ అయిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో రిజర్వేషన్లు పాటించకపోవడంతో స్థానిక ఉపా ధ్యాయులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ ఉపాధ్యా యులకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ప్రతిభ ఉన్నా వారి నియామకం జరగడం లేదని తెలిపారు. ఉపాధ్యాయ నియామకాల్లో చాలా అవకతవకలు జరుగు తున్నాయనీ, అనేక మంది ఇంటర్వ్యూలకు హాజరైన వారు బీసీ విద్యార్థి సంఘం దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. సొంత రాష్ట్రంలో బడుగు ఉపాధ్యాయులకు ఇంత అన్యాయం జరగడం పట్ల విద్యాశాఖలో ఉన్నత స్థాయిలో ఉన్న కొంతమంది దీనికి కారణమనీ, వెంటనే ఈ విద్యా సంవత్సరం 22-23 ఉపాధ్యాయ నియామకాల్లో రిజర్వేషన్లు పాటించాలని కోరారు. లేని యెడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామనీ, దీనికి కారణమైన వారిని ఆధారాలతో సహా బయట పెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ప్రయివేటు టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు పి.బడేసాబ్, గౌతమ్, కళ్యాణ్ దాస్, అర్జున్, బీసీ విద్యార్థి యువజన సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.