Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్
ఆదివారం రోజున మేడ్చల్‌లో డీవైఎఫ్ఐ మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించటం జరిగింది. ఈ సర్వేలో తేలింది ఏమనగా మేడ్చల్‌లోని కేఎల్ఆర్ వెంచర్లో గత కొన్ని రోజులుగా రోడ్డుపై డ్రైనేజీ పాడై మురికి నీరు రోడ్డు మీద పారుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా డీవైఎఫ్ఐ మేడ్చల్ జిల్లా నాయకులు నర్సింగ్‌రావు మాట్లాడుతూ వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని, అంతే కాకుండా చాలా ప్రదేశాలలో రోడ్లు నిర్మాణం పనులు చేయాల్సి ఉంది మరికొద్ది రోజుల్లో వర్షాలు వస్తే వీటి వల్ల ప్రజలకు చాలా ఎబ్బంది అవుతుంది. వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలి లేనియెడల పై స్థాయి అధికారులకి ఫిర్యాదు చేస్తాం అని హెచ్చరించారు.