Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
మహా ధర్నాకు బడంగ్పేట్ కార్పొరేషన్ టీిఆర్‌ఎస్ పార్టీ నాయకులు, పాదయాత్ర చేస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ఆదివారం కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా బాలాపూర్ చౌరస్తాలో భారీ ఎత్తున మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు పి.కార్తిక్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనిత హాజరయ్యారు. అంతకుముందు బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి స్థానిక మేయర్ చిగురింత పారిజాత నర్సింహ్మరెడ్డి, కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డితో కలసి పూల మాలలు వేసి మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లాపరిషత్ చైర్పర్సన్ తీగల అనితరెడ్డిలు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళలు రెండు కిలోమీటర్ల పొడవున పాదయాత్ర చేస్తూ బాలాపూర్ చౌరస్తాలోని సభాస్థలికి చేరుకున్నారు.