Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ ఇన్చార్జ్ ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్
నవతెలంగాణ-హయత్‌నగర్
దళిత, బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమించిన నాయకుడు, తెలంగాణ రాష్ట్రం కోసం తండ్లాడిన విప్లవ కెరటం మారోజు వీరన్న అప్పటి సమైక్య రాష్ట్రంలో ఎన్కౌంటర్ పేరుతో రాజ్యం పొట్టన పెట్టుకుందని ఎల్బీనగర్ టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్ అన్నారు. ఆదివారం మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని సహారా గేట్ నెం -2 వద్ద సామిత్రిబాయి పూలే విగ్రహ స్థాపన కమిటీ కో-కన్వీనర్ మేడిగ శ్రీధర్ ఆధ్వర్యంలో మారోజు వీరన్న 23వ వర్థంతిని నిర్వహించారు. అనంతరం పాదాచారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్ మాట్లాడు తూ బహుజన రాజ్యాధికారం కోసం మారోజు వీరన్న పరితపించాడన్నారు. అణగారిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను జాగతం చేసేందుకు కులపోరా టాలను బీజం వేశాడన్నారు. మార్క్స్, అంబేద్కర్ సిద్ధాంతాలను అవపోసనం పట్టిన ఆయన కుల, వర్గ పోరాటాం కోసం ఉద్యమించాడన్నారు. పిడికిలి రాజు మాట్లాడుతూ.. అణగారిన వర్గాలతో వర్గపోరాటం చేయించిన విప్లవ సేనాని వీరన్న అన్నారు. వర్గం పోరాటం ఒక్కటే సరిపోదు, కుల నిర్మూలన పోరాటాలు చేయాలని విప్లవ పార్టీలకు కొత్త పోరుబాట చూపిన మార్గ నిర్దేశకుడు మారోజు వీరన్న అని కొనియాడారు. సాయుధ పోరాటంలో గడ్డిపోచలతో గన్నులు పట్టించిన యోధులు పుట్టిన నల్లగొండ జిల్లా కవ్విరాల కొత్తగూడెం గ్రామంలో సూరమ్మ, రామలింగం దంపతులకు మారోజు వీరన్న జన్మించాడని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాట యోధులు సూరమ్మ, రామలింగంది కులాంతర వివాహమన్నారు. ఆదర్శ భావాలు ఉన్న కుటుంబంలో జన్మించడంతో వీరన్న చిన్నప్పటి నుండే విప్లవ భావాలను పుణికిపుచ్చుకున్నాడని తెలిపారు. బహుజన, రాజ్యం కోసం ఉద్యమించిన మారోజు వీరన్న పోరాటాల చరిత్రకు 1999 మే 16న కరీంనగర్ జిల్లా నర్సింగాపూర్ నెత్తుటి సాక్ష్యమైంద న్నారు. విప్లవ వీరుడు, బహుజనుల ముద్దుబిడ్డ మారోజు వీరన్నను పాలకులు దారుణంగా ఎన్కౌంటర్లో హతమార్చారని గుర్తుచేశారు. మారోజు వీరన్న ఆశయ సాధన కోసం, బహుజన రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరం కషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత గౌడ సంఘం అధ్యక్షులు వేములయ్యగౌడ్, నేతలు బోర శ్యాంసుందర్‌గౌడ్, బొంగు వెంకటేష్‌గౌడ్, లింగస్వామి, ఫెరోజ్, వీరమల్ల లింగంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.